Header Banner

లిక్కర్ స్కాంలో రాజ్ కసిరెడ్డి స్పందన.. బట్టేబాజ్‌ అంటూ విజయసాయిపై ఫైర్‌! ఆరోపణలపై క్లారిటీ..!

  Sat Apr 19, 2025 17:34        Politics

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి.. ఎట్టకేలకు స్పందించాడు. అయితే, ప్రత్యక్షంగా కాకుండా.. ఓ ఆడియో సందేశం పంపి సంచలనానికి తెరలేపాడు. ఇంతకీ రాజ్ తన ఆడియో మెసేజ్‌లో ఏం చెప్పాడు.. తనపై వస్తున్న ఆరోపణలపై ఎలాంటి క్లారిటీ ఇచ్చాడు.. అసలు అతను ఎక్కడ ఉన్నానన్నాడు.. పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. లిక్కర్ స్కామ్‌లో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి శనివారం నాడు ఒక ఆడియో మెసేజ్ రిలీజ్ చేశాడు. తనపై వస్తున్న ఆరోపణలకు క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు.. తనపై ఆరోపణలు చేసిన వారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సంచలన కామెంట్స్ చేశాడు.
లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తనకు సిట్ బృందం ఇచ్చిన నోటీసులపై లీగల్‌గా పోరాడుతున్నానని రాజ్ కసిరెడ్డి తెలిపారు. తనకు రెండుసార్లు నోటీసులు ఇచ్చారని ఆడియో మెసేజ్‌లో పేర్కొన్నారు. దీనిపై తాను కోర్టుకు వెళ్లగా.. నిర్ణీత సమయం ఇచ్చి నోటీసులు ఇవ్వాలని ఆదేశించారని కసిరెడ్డి పేర్కొన్నారు.

నాకు సంబంధం లేదు..
మద్యం కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని రాజ్ కసిరెడ్డి తేల్చి చెప్పారు. తనపై ఆరోపణలు చేసిన విజయసాయి రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి బట్టేబాజ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన న్యాయ పోరాటం పూర్తయిన తరువాత.. విజయసాయి రెడ్డి చరిత్ర బయటపెడతానని రాజ్ కసిరెడ్డి ప్రకటించారు. మీడియా ప్రతినిధులందరినీ పిలిచి బట్టేబాజ్ విజయసాయిరెడ్డి చరిత్ర మొత్తం బయటపెడతానని చెప్పారు. ఒకవైపు వాదన విని కథనాలు రాయొద్దంటూ మీడియాను కోరారు రాజ్. తనపై అసత్య కథనాలు సరికాదని విజ్ఞప్తి చేశారు.


ఇది కూడా చదవండిబీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


విజయసాయి రెడ్డికి బదులుగా కొత్త ఫైర్ బ్రాండ్! బీజేపీ నుండి ఆయన ఎంట్రీ!


జగన్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మంత్రి! నాస్తికుడిని తితిదే ఛైర్మన్ గా..


మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!


టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #RajKasireddy #LiquorScam #VijayasaiReddy #PoliticalFire #RajResponds #AudioMessage #AndhraPolitics